హైదరాబాద్ వరద బాధితులకు బాలకృష్ణ విరాళం…!!

0
24

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ గొప్ప మనస్సు చాటుకున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లోని కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈ వర్షాల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా కొంతమంది నిరాశ్రయులు అయ్యారు. అయితే హైదరాబాద్ వరద బాధితులకు నందమూరి బాలకృష్ణ ఒక కోటి 50 లక్షలు విరాళం ప్రకటించారు. ఇటీవల రోడ్డు పక్కనున్న నివాసాలు పూర్తిగా వర్షపు నీరుతో కొట్టుకుపోయిన వారికి అండగా నిలిచారు నందమూరి బాలకృష్ణ. అదేవిధంగా పాతబస్తీలో బసవతారక రామా సేవసమితి ఆధ్వర్యంలో 1000 కుటుంబలాకు బిర్యానీ ఏర్పాటు చేసి వారికి పంపించారు. ఈరోజు సాయంత్రం వారికి అవి ఇవ్వనున్నారు. అయితే కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అలాగే సినీ కార్మికుల కోసం నందమూరి బాలకృష్ణ విరాళాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

SHARE

LEAVE A REPLY