విద్యుత్‌ షాక్‌ కు గురై విద్యార్థి మృతి!

0
83

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –విద్యుత్‌ షాక్‌ కు గురై విద్యార్థి మఅతి చెందిన ఘటన ఆలమూరు మండలం చెముడులంక లో గురువారం చోటు చేసుకుంది. దసరా సెలవులు కావడంతో.. రెండవ తరగతి చదువుతున్న కోసూరి ప్రభు కుమార్‌ (7), అన్నయ్య కిరణ్‌ కుమార్‌ తో కలసి ఇంట్లో విద్యుత్‌ వైరుతో ఆడుకుంటున్నాడు. కార్లకు ఉండే చిన్న ఫ్యాన్‌ కు కరెంటు తెప్పించే ప్రయత్నం చేస్తుండగా.. ప్రభు కుమార్‌ కు షాక్‌ తగిలింది. ఆ సమయంలో ఫీజ్‌ కొట్టాల్సి ఉంది కాని ఫీజు వైరు బలమైంది కావడంతో అక్కడక్కడే ప్రభు కుమార్‌ మఅతి చెందాడు. అన్నయ్య భయపడి పారిపోవడంతో అతనికి ఎలాంటి హాని జరగలేదు. వీళ్ల తండ్రి నాలుగేళ్ల కిత్రం ఓ ఇటుక బట్టీ లో విద్యుత్‌ షాక్‌ గురై మఅతి చెందాడు.

SHARE

LEAVE A REPLY