మోదీ సర్కార్ యాప్ ఛాలెంజ్.. రూ.15 లక్షలు గెలుచుకున్న ఏపీ విద్యార్థి..!!

0
43

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒-కేంద్ర మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించిన వీడియో కాన్ఫ‌రెన్స్ సొల్యూష‌న్ ఛాలెంజ్‌లో ఎంపికైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యార్థి. దీంతో ఏపీ స్టూడెంట్ వంశీ కుమార్‌కి జాతీయ స్థాయి గుర్తింపు ల‌భించింది. వంశీ కుమార్ ఆదిత్య కాలేజ్‌లో చ‌దువుతున్నాడు. అమెరిక‌న్ జూమ్ యాప్‌కు ప్ర‌త్యామ్నాయంగా లిబిరో అనే భార‌తీయ యాప్‌ను రూపొందించాడు వంశీ. ఇది స‌క్సెస్ కావ‌డంతో కేంద్రం ప్ర‌భుత్వం నుంచి రూ.15 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీని కైవసం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం సోల్ఫీజ్ ఐటీ సొల్యూష‌న్‌లో సీటీఓగా వంశీ కుమార్‌ ప‌ని చేస్తున్నాడు. రెండు కంపెనీల‌కు ఇంజినీర్‌గా సేవ‌ల‌ను అందిస్తున్నాడు వంశీ. కాగా ఈ పోటీకి 12 కంపెనీలు పోటీ ప‌డ్డాయి. వీరిలో 25 మంది స‌భ్యులు జ్యూరీ ఫైన‌ల్‌కు ఎంపిక‌య్యారు. ఇందులో లిబిరో యాప్ 5వ స్థానంలో నిలిచింది.

కాగా భారత్, చైనా సరిహద్దుల్లో గత కొద్ది రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గాల్వాన్ లోయలో నెలకొన్న ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన 59 యాప్‌లను.. ఇండియా బ్యాన్ చేసింది. అలాగే ఈ నెల 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ కూడా లద్దాఖ్‌కి వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. అలాగే వేలాది భారత సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు మోదీ. ఇక ఈ నేపథ్యంలో ఆదివారం గాల్వాన్ లోయ సమీపం నుంచి రెండు కిలో మీటర్లు వెనక్కి తగ్గింది చైనా సైన్యం. అదే విధంగా భారత్ కూడా వివాదాస్పదంగా మారిన ప్రాంతంలో తాత్కాలిక నిర్మాణాలను తొలగించింది.

SHARE

LEAVE A REPLY