నాగ‌బాబు కామెంట్ల‌పై వ‌ర్మ సెటైర్‌

0
243

Times of Nellore (హైదరాబాద్)#సూర్య# : నంద‌మూరి బాల‌కృష్ణ‌ను ఉద్దేశిస్తూ మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు విడుద‌ల చేస్తున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతున్నాయి. మెగా ఫ్యామిలీపై బాల‌య్య గ‌తంలో చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ నాగ‌బాబు వాటికి కౌంట‌ర్లు ఇస్తున్నారు. ఆ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోల‌పై సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ట్విట‌ర్ ద్వారా స్పందించారు. `కామెంట్లు చేయ‌డంలో న‌న్ను మించిపోయార‌నే నా బాధ ఒక‌వైపు.. త‌న స్టార్ బ్ర‌ద‌ర్స్‌ను స‌మ‌ర్థించ‌డంలో సూప‌ర్‌స్టార్ అయిపోయార‌నే ఆనందం ఒక‌వైపు.. ఒక కంట క‌న్నీరు, మ‌రో కంట ప‌న్నీరు. నాగ‌బాబు గారూ హ్యాట్సాఫ్‌. మీ సోద‌రుల‌ను మీరు ఎంత‌గా ప్రేమిస్తున్నారో మేం కూడా అంతే ప్రేమిస్తున్నాం` అని వ‌ర్మ ట్వీట్ చేశారు.

SHARE

LEAVE A REPLY