విశాఖ లో వంచన పై గర్జన సభ

0
238

Times of Nellore (vizag) – ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గడుతూ వరుస నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తున్న వైకాపా మరోసారి వంచన పై గర్జన సభలతో మరింత దూకుడు పెంచింది .ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుపై నిరంతరం పోరాట ఉద్యమాలను ఉదృతం చేస్తున్న వైకాపా విశాఖలో వంచనపై గర్జన సభను నిర్వహించింది.మహిళా కళాశాల సమీపంలో బహిరంగ సభను ఏర్పాటు చేసిన వైకాపా నేతలు కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ముందుగా భారీ ర్యాలీగా తరలి వచ్చిన నేతలు భారీ వైకాపా జెండాను వాడవాడలా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు.పాదయాత్రలు చేస్తున్న జగన్ ప్రజల సమస్యలపై అద్యయనంతో పాటు వారి సమస్యల పరిష్కార మార్గాలను కూడా చూపుతున్నారని వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు.రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని అన్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రలు ప్రజల్లో చిరస్ధాయిగా నిలిచిపోతాయని అన్నారు.

SHARE

LEAVE A REPLY