చంద్రబాబుపై వల్లభనేని వంశీ తీవ్ర విమర్శలు

0
77

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం నాడు మీడియా మీట్ నిర్వహించిన వంశీ.. 30 ఏళ్ళ పాటు రైతులకు ఉచిత విద్యుత్‌కు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. ‘మేము స్కూల్‌కు వెళ్లక ముందే చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యారు. రైతులకు నిధుల బదిలీ పథకానికి ఉరివేసినట్లు ఎలా అవుతుంది?. చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నేత లోకేష్‌లా మాట్లాడితే ఎలా!. చంద్రబాబు మాటలకు మతి భ్రమించిది అనుకునేలా ఉన్నాయి. చంద్రబాబు కొడుకేమో గేరు వెయ్యలేక పోతున్నారు. ఎక్సలేటర్ తొక్కలేకపోతున్నారు. చంద్రబాబు దగ్గర బిర్యానీ పొట్లాలకు ప్రెస్‌మీట్లు పెట్టే నాయకులు ఉన్నారు ‘ అని వంశీ విమర్శలు గుప్పించారు.

అందుకే టీడీపీ గెలవలేదు..!

‘ఎన్టీఆర్ నాడు 50 రూపాయలకు హార్స్ పవర్ విద్యుత్ ఇచ్చి కుటుంబాలు పైకి రావడానికి కారణం అయ్యారు. తర్వాత వైఎస్సార్ ఇచ్చిన ఉచిత విద్యుత్ వల్లనే వ్యవసాయం బతికింది. చంద్రబాబు హయాంలో కరంట్ ఛార్జీలు పెంచారు. బషీర్ బాగ్‌కు కారణం అయ్యారు. అలా 2004లో టీడీపీ కరెంట్ ఛార్జీల వల్లనే మళ్ళీ గెలవలేదు. పాదయాత్రలో రైతుల బాధలు చూసి వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇచ్చారు. వైఎస్ మరణం తర్వాత ఉచిత కరంట్ పథకానికి తూట్లు పడింది.30 ఏళ్ళ పాటు రైతులకు ఇబ్బంది ఉండకూడదని కేంద్ర సంస్కరణలను జగన్ అందిపుచుకున్నారు. పెన్షన్లు, జీతాలు ఇచ్చినట్లే.. ఉచిత కరంట్ డబ్బులు అకౌంట్‌లో పడతాయి’ అని వంశీ చెప్పుకొచ్చారు.

SHARE

LEAVE A REPLY