మళ్లీ నక్సల్స్ పంజా.. ఇద్దరు జవాన్లు మృతి..

0
77

Times of Nellore (Dantevada) –కోట సునీల్ కుమార్:   అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. దంతేవాడలోని బచేలిలో ఓ సీఆర్‌పీఎఫ్ వాహనాన్ని పేల్చివేయడంతో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా కేవలం రెండు వారాల వ్యవధిలో భద్రతా దళాలపై నక్సల్స్ మూడోసారి దాడికి పాల్పడడం గమనార్హం.

అక్టోబర్ 30న ఎన్నికల ఏర్పాట్లపై కవరేజి కోసం దంతేవాడ వెళ్లిన దూరదర్శన్ ఛానెల్ జర్నలిస్టులు, సైనికులపై నక్సల్స్ మెరుపుదాడికి దిగారు. దీంతో ఓ సైనికుడు, జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయారు. గత నెల 27న ఛత్తీస్‌గఢ్‌లోని ఆవపల్లి వద్ద జరిగిన మరో దాడిలో నలుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారు.

SHARE

LEAVE A REPLY