విషాదం నింపిన కోడి పందాలు

0
255

Times of Nellore (Krishna) # కోట సునీల్ కుమార్ # – కోడిపందేలు కృష్ణా జిల్లాలో విషాదాన్ని నింపాయి. కోడి పందాల శిబిరాలపై పోలీసులు దాడి చేయడంతో తప్పించుకునేందుకు యత్నించి బావిలో దూకడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చాట్రాయి మండలం చిత్తపూర్‌లో జరిగింది. అర్ధరాత్రి ఫ్లెడ్‌లైట్ల వెలుతురులో చిత్తపూర్‌లో కోడిపందేలు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కోడిపందేల శిబిరాలపై దాడులు చేశారు. దీంతో నిర్వాహకులు పరుగులు పెట్టారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో చిత్తూరి శ్రీనివాసరావు(20), కుక్కల చెన్నకేశవరావు(26) అనే యువకులు బావిలో దూకారు. కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతదేహాలతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు.

SHARE

LEAVE A REPLY