ఖైదీ టికెట్లు దొరకలేదని గొంతు కోసుకున్న యువకుడు…

0
360

Times Of Nellore ( Visakhapatnam ) – ఖైదీ నెం.150 సినిమా విడుదల కావడంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ఫ్యాన్స్ కేకలు, అరుపులతో థియేటర్ ప్రాంగణాలు హోరెత్తిపోతున్నాయి. ఇంత సందడి నెలకొన్న విశాఖ రామాటాకీస్ వద్ద ఓ యువకుడు చేసిన పనితో అంతా నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. కలకలం రేగింది. మద్యం మత్తులో బ్లేడ్‌తో ఒంటి‌పై గాయ‌పరచుకుని ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. చిరు సినిమా టిక్కెట్ కావాలంటూ నానా రచ్చ చేశాడు. దీంతో థియేటర్ యాజమాన్యంలో ఆందోళన మొదలైంది. వెంటనే అతన్ని వైద్యం నిమిత్తం తరలించాలని ప్రయత్నించారు. అయినా అతను మూర్ఖంగా వ్యవహరిస్తూ సినిమా టికెట్ ఇవ్వకపోతే చచ్చిపోతానంటూ అందరినీ హడలెత్తించాడు. పోలీసులు రావడంతో పరిస్థితి సద్దుమణిగింది.

SHARE