ఏపీలో పలుచోట్ల పిడుగులు పడే అవకాశం

0
119

Times of Nellore (Amaravati) #కోట సునీల్ కుమార్ #– రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. ప్రకాశం, కర్నూలు, గుంటూరు, విశాఖపట్టణం, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని సూచించింది. ప్రకాశం జిల్లాలోని కుంబం, గిద్దలూరు, బెస్తవారిపేట, రాచెర్ల, కొమరోలులో పిడుగులు పడనున్నాయని తెలిపింది. ఇక కర్నూలు జిల్లాలో వెలిగండ్ల, బండిఆత్మకూరు, మహానంది, కొత్తపల్లి లో పిడుగులు పడొచ్చని స్పష్టంచేసింది. చిత్తూరు జిల్లాలో తిరుపతి, శాంతిపురంలో పిడుగులు పడతాయని వెల్లడించింది. విశాఖపట్టణం జిల్లా లో నర్సీపట్టణం, గోలుగొండ, రోలుగుంట, జి.కె. వీధి, మాడుగుల, చింతపల్లి, జి.మాడుగుల, అనంతగిరిలో పిడుగులు పడతాయని హెచ్చరించింది. గుంటూరు జిల్లాలో వెల్తుర్థి, దుర్గి లో… విజయనగరం జిల్లాలో పాచిపెంట, రామభధ్రాపురం, సాలూరు మండలాల పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం మరియు పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విజ్ఞప్తి చేసింది.

SHARE

LEAVE A REPLY