మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారం

0
781

Times Of Nellore (Hyderabad)- బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితుల్లో బోయిన్‌పల్లి పోలీసులు ఓ నిందితుడిని శనివారం అదుపులోకి తీసుకొన్నారు. ఏసీపీ రంగారావు వివరాల ప్రకారం.. ఓల్డ్‌ బోయిన్‌పల్లి, ఆర్‌ఆర్‌ నగర్‌కు చెందిన కర్తాల్‌ రాజు(23), సాయికిరణ్‌(27)లు స్నేహితులు. వీరు కారు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా రాజు స్థానికంగా నివసించే ఓ మైనర్‌ బాలిక (17)ల మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం రాజు బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల 15న తమ వివాహం విషయమై మాట్లాడాలంటూ రాజు బాలికకు ఫోన్‌ చేశాడు. దీంతో బాలిక ఆ రోజు సాయంత్రం 6 గంటలకు మూత్ర విసర్జనకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి చాలాసేపటి వరకు తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు బాలిక కోసం గాలించి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్దమవుతున్న క్రమంలో రాత్రి ఒంటిగంటకి ఇంటికి చేరుకుంది. బాలికను ప్రశ్నించగా డైరీ ఫారం రోడ్డులోని ఓ నిర్మాణుష్య ప్రాంతంలో రాజు, సాయికిరణ్‌లు తనపై అత్యాచారం చేసి ఫరారయ్యారని చెప్పింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు రాజును అదుపులోకి తీసుకొని విచారించగా తాను, సాయికిరణ్‌లు పలుమార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఫరారీలో ఉన్న సాయికిరణ్‌ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

SHARE

LEAVE A REPLY