మైనింగ్‌ శాఖ విశ్రాంత ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ

0
157

Times of Nellore ( Guntur ) – పట్టణ శివారు కోటప్పకొండ రోడ్డులోని రవీంద్ర నగర్‌లో నివాసం ఉంటున్న విశ్రాంత మైనింగ్‌ శాఖ ఉద్యోగి సాంబశివరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ.30 లక్షల సొత్తును దొంగలు అపహరించారని బాధితులు వాపోయారు. ఇందుకు సంబంధించి రూరల్‌ సీఐ బీ ప్రభాకర్‌ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

సోదరికి అనారోగ్యంగా ఉండటంతో సాంబశివరావు దంపతులు శనివారం హైదరాబాద్‌ వెళ్ళారు. ఆదివారం ఇంటి కిటికీలు తీసి ఉండటం గమనించి స్థానికులు సాంబశివరావుకు తెలపగా సాంబశివరావు దంపతులు హుటాహుటిన తిరిగి వచ్చారు. ఇంట్లో చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ కే నాగేశ్వరరావు, జిల్లా నేర విభాగ అదనపు ఎస్పీ పీ వెంకటేశ్వరరావు, రూరల్‌ సీఐ బీ ప్రభాకర్‌లు సంఘటనా స్థలికి వెళ్లి ఆధారాలు సేకరించారు. బాధిత దంపతుల వద్ద నుంచి వివరాలు సేకరించారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌లు సంఘటనా స్థలికి వచ్చి వివరాలు సేకరించాయి. కీలక మైన ఆధారాలు లభించాయనీ, త్వరలోనే నిందితుల ఆచూకీ కనుగొంటామనీ పోలీసులు తెలిపారు.

SHARE

LEAVE A REPLY