మేయర్‌ దంపతుల హత్యకేసు 26కి వాయిదా

0
171

Times of Nellore ( Chittoor ) – చిత్తూరు మేయర్‌ దంపతుల హత్యకేసును 9వ కోర్టు జడ్జి కబర్థి ఈనెల 26కి వాయిదా వేశారు. మాజీ మేయర్‌ కఠారి అనురాధ, కఠారి మోహన్‌లు రెండేళ్ల కిందట కార్పొరేషన్‌ కార్యాలయంలో హత్యకు గురయ్యారు. ఈ సంఘటనపై వన్‌టౌన్‌ పోలీసులు చంద్రశేఖర్‌ అలియాస్‌ చింటూతో పాటు మరో 22 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వారిలో 18 మందికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. మిగిలిన వా రు రి మాండ్‌లో ఉన్నారు. ఈ కేసు మంగళవారం 9వ కోర్టులో వాయిదా ఉం డగా, జడ్జి కబర్థి ఈనెల 26కి వాయిదా వేశారు. కడప జైలులో ఉన్న చింటూను పోలీసులు బందోబస్తు మధ్య కోర్టులో హాజరుపరిచారు.

SHARE

LEAVE A REPLY