సీపీఐ-జేసీ వర్గీయుల మధ్య ఘర్షణ

0
98

Times of Nellore ( Anantapur ) – అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం వద్ద సీపీఐ, జేసీ వర్గీయులు పరస్పరం ఘర్షణకు దిగారు. కమ్యూనిస్టులు దొంగలు అంటూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జేసీ వ్యాఖ్యలపై సీపీఐ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా జేసీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు సీపీఐ నేతలు యత్నించగా జేసీ వర్గీయులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సీపీఐ, జేసీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీపీఐ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

SHARE

LEAVE A REPLY