చంద్రబాబును కలిసిన బుట్టా రేణుక

0
664

Times of Nellore ( Amaravathi ) – కర్నూలు వైకాపా ఎంపీ బుట్టా రేణుక తెదేపా పార్టీలో చేరడానికి మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడుని ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. బుట్టా రేణుక అనుచరులు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌ రెడ్డిలు ఆమె సమక్షంలో తెదేపాలో చేరారు.

ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. ఆనాటి తొమ్మిదేళ్ల చంద్రబాబు పరిపాలనను స్వర్ణయుగంగా పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల ఎంపీలు చంద్రబాబు పనితీరును ప్రశంసిస్తున్నారని కొనియాడారు. రాజకీయాలకు కొత్త అయినా రాష్ట్ర అభివృద్ధికి తోడుగా నిలుస్తానని రేణుక పేర్కొన్నారు.

SHARE

LEAVE A REPLY