తమ్మినేనికి తప్పిన ముప్పు..!!

0
59

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఘోరం రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. స్పీకర్ తమ్మినేని కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన ఓ ఆటో బీభత్సం సృష్టించింది. ఆటోను తప్పించబోయిన స్పీకర్ కారు పొలాల్లోకి దూసుకెళ్ళింది. ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న తర్వాత తిరుగు ప్రయాణమైన స్పీకర్ కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది.

శ్రీకాకుళం జిల్లా వాకలవలస, వంజంగి గ్రామాల గుండా స్పీకర్ తమ్మినేని కాన్వాయ్ వెళుతుండగా ప్రమాదం జరగింది. పాలకొండ రోడ్డులో కాన్వాయ్ వెళుతుండగా.. ఓ ఆటో అందులోకి చొరబడింది. ఆ ఆటోను తప్పించబోయిన స్పీకర్ వాహనం పొలాల్లోకి దూసుకెళ్ళింది. శ్రీకాకుళం నుచి ఆముదాలవలసకు స్పీకర్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారును ఢీకొన్ని బోల్తా పడిన ఆటోలో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. కారులోంచి దిగిన స్పీకర్.. గాయపడిన వారిని దగ్గరుండి మరీ శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలింపజేశారు. ప్రత్యామ్నాయ వాహనంలో స్పీకర్ తమ్మినేని తన ఇంటికి వెళ్లిపోయారు.

SHARE

LEAVE A REPLY