రేపటి నుంచి టెట్ పరీక్ష.. అంతా సిద్ధం: మంత్రి గంటా

0
348

Times of Nellore ( Visakhapatnam ) – రేపటి నుంచి ఈనెల 19 వరకు టెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రోజూ రెండు సెషన్లలో టెట్‌ నిర్వహణ ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌లోనే టెట్‌ నిర్వహిస్తామని, ఇందుకోసం 113 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. టెట్‌రాసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. 2014లో 10వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, రెండోసారి డీఎస్సీ ద్వారా 10,351 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

SHARE

LEAVE A REPLY