మంగళగిరిలో విద్యార్ధి నాయకులకు తెలుగుదేశం పార్టీ శిక్షణ తరగతులు…

0
927

Times of Nellore ( Nellore ) – మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు తెలుగునాడు విద్యార్ధి సమైఖ్య రాష్ట్ర, జిల్లా, మండల కమిటి విద్యార్ధి నాయకులకు తెలుగుదేశం పార్టీ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆయన తన చిన్న నాటి కాలం నుండి సినిమా రంగ ప్రవేశం, ఆయన రాజకీయ ప్రస్థానం, రాజకీయంగా ఎదిగిన అంశాలు, ఆయనను ఆంధ్రప్రజలు ఏలా ఆదరించారని వివరించారు. అలాగే చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రవేశం, ప్రజా సంక్షేమ పథకాలు గురించి ఆ సంక్షేమ పథకాలను ప్రజలోకి ఏలా తీసుకోని వెళ్లాలి. ఆ పథకాల వల్ల ముసలి వాళ్లు, యువత, ఆడవాళ్లుకి ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నారు అనే విషయం గురించి ఆ పథకాలను ప్రజలోకి ఏలా తీసుకొని వెళ్లాలి. అలాగే  తరువాత ఎలక్షన్ లో తెలుగు దేశం పార్టీ ని అధికారం మరల దక్కే విధంగా విద్యార్ధి సంఘ నాయకులు ఏలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని అనే అంశాల మీద శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమం టి.ఎన్.ఎస్.ఎఫ్ జిల్లా కార్యదర్శి అసనాపురం వెంకటేష్, మోడే సాయి, నవీన్ చంద్ర, శశి, టి.ఎన్.ఎస్.ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY