తెలంగాణ అవతరణ వేడుకల షెడ్యూల్‌ ఖరారు

0
78

Times of Nellore (Hyd) #కోట సునీల్ కుమార్ #– తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. జూన్‌ 2న ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య రాష్ట్రావతరణ ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వేడుకలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ప్రస్తుత సంప్రదాయంలో మార్పులు చేయాలని సూచించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున తొలుత అమరవీరుల స్తూపానికి సీఎం కేసీఆర్‌ నివాళులర్పిస్తారు. ఉదయం 9 గంటల నుంచి పతాకావిష్కరణ, పోలీసుల గౌరవ వందన కార్యక్రమం జరుగుతాయి. ఉదయం 10.30లకు సీఎస్‌ ఆధ్వర్యంలో ‘ఎట్‌ హోం’ కార్యక్రమం నిర్వహిస్తారు. 11 గంటలకు జూబ్లీ హాలులో రాష్ట్రావతరణ అంశంపై కవి సమ్మేళనం ఉంటుంది. అదే రోజు సాయంత్రం పురస్కార ప్రదానోత్సవం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

SHARE

LEAVE A REPLY