ఈ నెల 18న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

0
78

Times of Nellore (Hyd) # కోట సునీల్ కుమార్ # – ఇంటర్‌ ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం నెలకొనడంతో తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు పని తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 18న ఇంటర్‌ ఫలితాలను విడుదల చేస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్యామండలి ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ పత్రికా ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇంటర్‌ వార్షిక పరీక్షలు 2019 ఫలితాల ప్రక్రియ తుది దశకు చేరుకున్నాయని.. ఈ నెల 18న ఫలితాలను ప్రకటిస్తామని పేర్కొన్నది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇంటర్ పరీక్షలు ఒకేసారి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో గత శుక్రవారం ఫలితాలను విడుదల చేయగా.. తెలంగాణలో మాత్రం ఇంటర్‌ ఫలితాల విడుదలపై అయోమయ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు నిర్ణయంతో ఒక స్పష్టత వచ్చింది.

SHARE

LEAVE A REPLY