రాయపాటిని బుజ్జగించేందుకెళ్లిన ప్రత్యేక దూతలు

0
67

Times of Nellore  (Guntur) # కోట సునీల్ కుమార్ # – ఎంపీ రాయపాటి సాంబశివరావు అలకబూనారు. టీడీపీ అధిష్టానం ఆయనకు నరసరావుపేట టికెట్ నిరాకరించడంతో మనస్తాపం చెందారు. దీంతో ఆయన పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ అప్రమత్తమైంది. రాయపాటిని బుజ్జగించేందుకు చంద్రబాబు వద్ద నుంచి ప్రత్యేక దూతలుగా పలువురు నేతలు వెళ్లారు. రాయపాటితో టీడీపీ హైకమాండ్‌ సంప్రదింపులు జరుపుతోంది. ఇదిలా ఉంటే పార్టీ మారవద్దంటూ మంత్రి నారా లోకేష్, ఎంపీ సుజనాచౌదరి, టీడీ జనార్దన్‌ ఫోన్‌లో కోరారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని లోకేష్‌ సూచించారు. రాయపాటి పార్టీ మారితే ఆయనతో పాటు వెళ్లేందుకు గుంటూరు అర్బన్‌ టీడీపీ నేతలు సిద్ధమయ్యారు.

SHARE

LEAVE A REPLY