తెలంగాణ లో పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులు

0
511

Times of Nellore (Hyd) – రాష్ట్రంలో రోజురోజుకూ స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యాధికారులను అప్రమత్తం చేయడమేగాకుండా స్వైన్‌ఫ్లూ లక్షణాలతో బాధపడేవారి శాంపిళ్లను తీసి వెంటనే నారాయణ గూడలోని ఐపీఎమ్‌కు పంపించాలని జిల్లా ఆస్పత్రులను ఆదేశించింది. పర్యవేక్షణ కోసం నలుగురు వైద్యులతో స్టేట్‌ నోడల్‌ టీమ్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో నమోదవుతోన్న స్వైన్‌ఫ్లూ కేసులను ఏ,బీ,సీ మూడు కేటగిరిలుగా విభజించి చికిత్స అందిస్తున్నారు. ఏ కేటగిరి కేసులను ఇంటివద్దే ఉంచి పరీక్షలు, మందులతో చికిత్స అందిస్తున్నారు. కొద్దిగా జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ల నొప్పులు వంటి లక్షణాలుంటే ఏ కేటగిరి కింద పరిగణిస్తారు. బీ కేటగిరి కేసులకు కూడా ఏ కేటగిరి తరహాలోనే చికిత్స అందిస్తున్నారు. సీ కేటగిరిలో ఏబీ కేటగిరి లక్షణాలతోపాటు శ్వాస తీసుకోలేకపోవడం, చాతినొప్పి, లోబీపీ, దగ్గులో రక్తం పడడంవంటి వాటిని స్వైన్‌ ఫ్లూ కేసుల్లో తీవ్రమైనవిగా పరిగణిస్తారు. వీటికి హెచ్‌1ఎన్‌1 పరీక్షలు అవసరమవుతాయి. రాష్ట్రంలో 31 జిల్లా ఆస్పత్రుల్లో స్వైన్‌ ఫ్లూ బాధితులకు చికిత్స అందించేందుకు ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు.

SHARE

LEAVE A REPLY