డెన్మార్క్‌ ఓపెన్ టోర్నీక్వార్టర్స్‌లోకి కిదాంబి శ్రీకాంత్!!

0
27

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ కరోనా వల్ల లభించిన విరామం తర్వాత తిరిగి అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ దూసుకుపోతున్నాడు. డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నీలో మాజీ ప్రపంచ ఛాంపియన్‌ కిదాంబి శ్రీకాంత్‌ అదరగొడుతున్నాడు. టోర్నీలో పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో ఐదో సీడ్‌ శ్రీకాంత్‌ 21-15, 21-14తో కెనడా ఆటగాడు జేసన్‌ ఆంటోనీ ను చిత్తుగా ఓడించాడు. శ్రీకాంత్‌ అద్భుత ఆటతీరుతో ప్రత్యర్థిపై పైచేయి సాధించి, కేవలం 33 నిమిషాల్లోనే ఆటను ముగించాడు. 22ఏండ్ల జేసన్‌పై పదునైన స్మాష్‌లతో విరుచుకుపడిన శ్రీకాంత్‌ రెండు గేమ్‌లను సులువుగా గెలుచుకున్నాడు.

SHARE

LEAVE A REPLY