భద్రాచలం: స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్

0
69

Times of Nellore (Bhadrachalam) # కోట సునీల్ కుమార్ # – భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారికి మరికాసేపల్లో పట్టాభీషేకం చేయనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీరామనవమి సందర్బంగా కల్యాణం నిర్వహించిన మిథిలా స్టేడియం వేదికపైనే పట్టాభిషేకం జరగనుంది. మేళతాళాల నడుమ స్వామివారి ఉత్సవ మూర్తులను పల్లకిలో మిథిల స్టేడియంలో ఆసీనం చేశారు. అనంతరం విశ్వక్షేణ ఆరాధనతో పట్టాభిషేక మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. ఇందుకు వినియోగించే పూజా ద్రవ్యాలకు పుణ్యహోచనం చేశారు. తర్వాత పవిత్ర నదీజలాలతో స్వామివారికి అభిషకం జరిపి అష్టోత్తర, సహస్త్ర నామార్చన.. సువర్ణపుష్పార్చన చేస్తారు.

SHARE

LEAVE A REPLY