15న తిరుపతికి స్పెషల్‌ రైలు

0
317

Times of Nellore (Warangal) – కాజీపేట జంక్షన్‌ మీదుగా ఈ నెల 15న తిరుపతికి స్పెషల్‌ రైలు నడిపిస్తున్నారు. (02164) నెంబరు గల స్పెషల్‌ రైలు హైదరాబాద్‌లో ఈనెల 15న రాత్రి 7.40కి బయలు దేరి 9.40కి కాజీపేటకు వస్తుంది. 16న ఉదయం 8.10 ని.లకు తిరుపతికి చేరుకుంటుంది. ఇదే రైలు (02763)తిరుపతిలో ఈ నెల 17న రాత్రి 7గం.లకు బయలు దేరి 18న ఉదయం 6.35కు కాజీపేటకు వస్తుంది. 8.35ని.లకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలు సికింద్రాబాద్‌, కాజీపేట జంక్షన్‌, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, రైల్వే స్టేషన్‌లలో హాల్టింగ్‌ సౌకర్యం కల్పించారు. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ఈ స్పెషల్‌ రైలు కేవలం ఒక్క రోజు అప్‌అండ్‌ డౌన్‌ నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

SHARE

LEAVE A REPLY