అత్యంత విషమంగా ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి..

0
62

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని ఎంజిఎం వైద్యబృందం స్పష్టం చేసింది. బాలు చికిత్స పొందుతున్న చెన్నై ఎంజిఎం హాస్పిటల్ దగ్గర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. బాలు ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఒక్కొక్కరుగా ప్రముఖులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. దీంతో ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం రాత్రి నుంచి బాలు తీవ్ర జ్వరం తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఇప్పటికే ఆయనకు ఎక్మో, వెంటిలేటర్ ద్వారా చికిత్సను అందిస్తున్నారు వైద్యులు. 10 మంది మెరుగైన వైద్యుల పర్యవేక్షణలో బాలు ఆరోగ్యాన్ని కుదటపరిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం బాలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్దపెట్టి సహకారం అందిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ వైద్యులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు బాలు ఆరోగ్య పరిస్ధితి విషమించడంతో ఆయన కుటుంబ సభ్యుల, శ్రేయోభిలాషులు, ప్రముఖులు ఎంజీఎం హాస్పిటల్‌కు చేరుకున్నారు.
అభిమానులు కూడా భారీగా తరలివస్తుండటంతో హాస్పిటల్ పరిసరాల్లో ఆంక్షలు విధించారు. ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. కరోనా పరిస్థితుల కారణంగా అభిమానులు, శ్రేయోభిలాషులు హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ఉండకూడదు అని హెచ్చరిస్తున్నారు. బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందనే విషయం తెలుసుకొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాస్పిటల్ వర్గాలతో ఫోన్ లో మాట్లాడారు. మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.నటుడు కమల్ హాసన్ హాస్పిటల్‌కు వచ్చి వైద్యులు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బయటకి వచ్చిన ఆయన బాలు ఆరోగ్యం విషమంగానే ఉందని అన్నారు. బాలు ఆరోగ్య పరిస్ధితి మరింత క్షీణించడంతో..బంధువులు, అభిమానులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఆస్పత్రికి ఫోన్ కాల్స్ వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు బాలు ఆరోగ్యం పరిస్ధితిపై ఆరా తీస్తున్నారు. బాలు త్వరగా కోలుకోవాలంటూ సెలబ్రిటీలు, అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.

SHARE

LEAVE A REPLY