యూరినరీ ఇన్‌ఫెక్షన్లకు ఓ పరిష్కారం

0
439

Times of Nellore (హైదరాబాద్‌)#సూర్య# : భారతదేశంలో ప్రతి 10మంది మహిళల్లో ఏడుగురు ఈ యూటీఐల బారినపడుతున్నారని నేషనల్‌ సెంటర్‌ఫర్‌ బయోటెక్నాలజీ ఇన్‌ఫర్మేషన్‌(ఎన్‌సీబీఐ) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అపరిశుభ్రంగా ఉన్న మూత్రశాలలు అందుకు ప్రధాన కారణంగా తేలింది. ఈ నేపథ్యంలో.. ప్రదీప్ యాడ్‌ ఇండియా సంస్థ(పీఏఐపీఎల్‌) మహిళల కోసం ఓ వినూత్నమైన ఉత్పత్తిని ఆవిష్కరించింది. పీ-కోన్‌ డిస్పోజబల్‌ యూరినేషన్‌ డివైజ్‌గా వ్యవహరిస్తున్న ఆ ఉత్పత్తిని నటులు రామ్‌ కార్తీక్‌, ప్రణీత్‌ రెడ్డి, దర్శకుడు బాలపూడి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీఏఐపీఎల్‌ సీఈవో ప్రదీప్‌ ద్వివేది పీకోన్‌ అవసరాన్ని వివరించారు. ‘‘స్కూళ్లు, కాలేజీలు, టూరిస్టు ప్రదేశాల్లో మూత్రవిసర్జనకు వెళ్లినప్పుడు మహిళలు అసౌకర్యానికి గురవుతుంటారు. అపరిశుభ్రతగా ఉండే టాయిలెట్లు, ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. ముఖ్యంగా గర్భిణులకు ఈ అంటురోగాలు చాలా ప్రమాదం. ఈ సమస్యలకు పరిష్కారంగా పీ-కోన్‌ను తీర్చిదిద్దాం. మహిళలు నిల్చుని మూత్ర విసర్జన చేసేందుకు ఇది తోడ్పడుతుంది. డిస్పోజబుల్‌ డివైజ్‌ కావడం వల్ల హ్యాండ్‌బ్యాగ్‌లో దీనిని తీసుకువెళ్లవచ్చు’’ అని తెలిపారు.

SHARE

LEAVE A REPLY