స్నానం చేసేందుకు వెళ్లి యువకుడు మృతి!

0
50

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –వంశధార కుడి ప్రధాన కాల్వలో స్నానం చేసేందుకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం మండలంలోని చిన్నమురపాక గ్రామంలో చోటు చేసుకుంది. లావేరు మండలం చిన్నమురపాక గ్రామానికి చెందిన కింతలి మణికంఠ (21) అనే యువకుడు నందికొండ కాలనీలో ఉండే తన మామయ్య ముచ్చేటి వెంకన్న ఇంటికి దసరా పండుగ కోసమని మంగళవారం రాత్రి వచ్చాడు. బుధవారం ఉదయం తోటి యువకులతో కలిసి మండలంలోని సరుబుజ్జిలి కూడలికి సమీపంలో ఉన్న వంశధార కుడి ప్రధాన కాల్వలో స్నానం చేసేందుకు వెళ్లాడు. కాల్వలో ఈత కొడుతూ గల్లంతయ్యాడు. స్థానికులు మణికంఠ ఆచూకీ కోసం కాల్వలో వెతకగా.. గట్టు పక్కనే మణికంఠ శవమై కన్పించాడు. మృతుడి కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా సమాచారాన్ని అందించారు. మృతుడు ఎచ్చెర్లలోని వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాలలో పాలిటెక్నిక్‌ చదువుతున్నట్లు స్థానికులు తెలిపారు.

SHARE

LEAVE A REPLY