వైసీపీలో చేరనున్న సీనియర్ నటుడు శివాజీ రాజా!

0
252

Times of Nellore (Hyd)# కోట సునీల్ కుమార్ # – ప్రముఖ నటుడు, ‘మా’(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. ఆయన త్వరలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇవాళ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన జగన్ లోటస్‌పాండ్‌‌లోనే ఉన్నారు. ఇప్పటికే మా మాజీ అధ్యక్షుడు అపాయింట్మెంట్ తీసుకున్నారని తెలుస్తోంది.

కాగా.. పలువురు సీనియర్ నటులు ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకోగా శివాజీ రాజా కూడా ఆ జాబితాలో చేరనున్నారు.! శివాజీ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని వాట్సాప్, ఫిల్మ్‌నగర్‌లో పెద్ద ఎత్తున పుకార్లు వస్తున్నాయి. అయితే ఇది ఎంత వరకు నిజం అనే విషయం తెలియాల్సి ఉంది. ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో రెండోసారి పోటీచేసిన శివాజీ రాజా ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

SHARE

LEAVE A REPLY