అమరావతిలో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత!

0
89

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒ – తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అమరావతిలో అద్దెకు ఉంటున్న ఇంటి వద్ద ఉద్రికత్త చోటు చేసుకుంది. కొందరు ప్రైవేటు వ్యక్తులు చంద్రబాబు నివాసంపైకి డ్రోన్‌ను ప్రయోగించారు. దీంతో తెదేపా కార్యకర్తలు వారిని పట్టుకున్నారు. పోలీసులు కలుగ జేసుకొని డ్రోన్‌ ప్రయోగించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. జల వనరుల శాఖ అధికారుల అనుమతితోనే డ్రోన్‌ ప్రయోగించినట్లు వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు.ఈ క్రమంలో పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

చంద్రబాబు నివాసానికి చేరుకున్న తెదేపా నేతలు దేవినేని అవినాష్‌, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు నిజాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు.ఈ క్రమంలో తెదేపా నేతలు పోలీసు జీపును చుట్టుముట్టారు. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న చంద్రబాబు నివాసంపైకి డ్రోన్‌ ప్రయోగించడానికి గల కారణాలను తమకు తెలపాల్సిందేనంటూ పట్టుబట్టారు. అక్కడ ఉన్న కరకట్టపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

SHARE

LEAVE A REPLY