సేవ్ ఆర్.టి.సి

0
308

Times of Nellore – ( Gangavaram ) – ఆర్.టి.సీ ని కాపాడాలని పరిశ్రమల శాఖా మంత్రివర్యులు అమరనాథ రెడ్డి ఎన్ఎంయూ నాయకులు కోరారు. గంగవరం మండలంలోని తాళప్పల్లె పంచాయతీ పరిధిలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీలో భాగంగా పర్యటిస్తోన్న మంత్రిని బుధవారం ఎన్ఎంయూ నాయకులు కలసి  తమ సమస్యలను ఏకరువు పెట్టుకున్నారు. ఆర్టిసి సంస్థను కాపాడుకోవాల్సిన భాద్యత అందరిపై ఉందని, సంస్థ పూర్వ వైభవానికి తమ వంతు కృషి చేయాలని మంత్రిని కోరి సేవ్ ఆర్టీసి పేరుతో ముద్రించిన కరపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయూ స్టేట్ సెక్రటరి బిఎస్.బాబు, రీజనల్ సెక్రటరి రమణరావ్, ప్రెసిడెంట్ అర్జున్, డివిజనల్ నాయకులు గణేష్,ఏవై రెడ్డి, ఆర్.వి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY