స‌ర్వీసుల పున‌రుద్ద‌ర‌ణ‌..తొలి రోజు ఏపీఎస్‌ఆర్టీసీ ఆదాయం ఎంతంటే..!!

0
155

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒– ఆంధ్ర‌ప్ర‌దేశ్ ‌ఆర్టీసీ బస్సు సర్వీసులు పునరుద్ధరించిన విష‌యం తెలిసిందే. ఈ నిర్ణ‌యంతో మొద‌టి రోజు ఆర్టీసీకి రూ.71 లక్షల ఆదాయం వచ్చింది. గురువారం మొత్తం 1,483 సర్వీసులు తిరగగా… ఆక్యుపెన్సీ రేట్‌ 40 శాతంగా న‌మోదైంది. కొవిడ్ కార‌ణంగా‌ ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆక్యుపెన్సీ రేట్ (ఓఆర్)‌ 64 శాతంగా ఉంది. శుక్రవారం రోజున‌ సర్వీసులను 1,316లకు కుదించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 169 స‌ర్వీసులు నడిపితే..కోవిడ్-19 వ్యాప్తి అధికంగా ఉన్న‌ గుంటూరు జిల్లాలో కేవలం 10 సర్వీసులే తిరిగాయి. మ‌రోవైపు ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఏప్రిల్‌ నెల జీతం చెల్లించాలని సంస్థ ఎండీ ఎం.ప్రతాప్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. గ‌వ‌ర్న‌మెంట్ రూల్స్ మేరకు 90 శాతం జీతం చెల్లించాలంటూ పేర్కొన్నారు.

ఇక కరోనావైర‌స్ వ్యాప్తి తెలుగు రాష్ట్రాల్లో అధికంగానే ఉంది. ఇంత‌వ‌ర‌కు ఈ వ్యాధికి వ్యాక్సిన్ కానీ, మెడిసిన్ కానీ రాక‌పోవ‌డంతో..ప్ర‌జ‌లు ఎవ‌రికివారు జాగ్ర‌త్త చ‌ర్య‌లు పాటించాలని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సూచిస్తున్నారు. భౌతిక దూరం పాటించ‌డం, మాస్కులు ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి అని చెబుతున్నాయి. అందుకే ఉభ‌య తెలుగు రాష్ట్రాలు ప్ర‌జా ర‌వాణా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాయి. ఆర్టీసీ బ‌స్సులు ఎక్కేముందు ప్ర‌యాణీకుల‌కు థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ చేస్తున్నారు అధికారులు. శానిటైజ‌ర్లు అందుబాటులో ఉంచుతున్నారు. కాగా ఇరు రాష్ట్రాల స‌మ్మ‌తితో అంతరాష్ట్ర బ‌స్సు స‌ర్వీసులు న‌డుపుకోవ‌చ్చ‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. కానీ తెలుగు ‌రాష్ట్రాలు మాత్రం ఆయా రాష్ట్రాల ప‌రిధిలోనే ఆర్టీసీ బ‌స్సుల‌ను న‌డుపుతున్నాయి.

SHARE

LEAVE A REPLY