రాక్షసులు, మోసగాళ్లతో యుద్ధం : వైఎస్‌ జగన్‌

0
138

Times of Nellore (Anantapur) # కోట సునీల్ కుమార్ # – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని… వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటుకు రూ. 3 వేలు ఇస్తామంటూ గ్రామాల్లోకి డబ్బు మూటలు తరలిస్తారని విమర్శించారు. 55 నెలలు పాటు కడుపు మాడ్చి చివరి 3 నెలలు అన్నం పెడతానంటున్న వారిని ఏమనాలని ప్రశ్నించారు. ప్రజారంజక పాలన అందించాలంటే రాక్షసులు, మోసగాళ్లతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. చంద్రబాబు కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు.

సోమవారం అనంతపురం సమర శంఖారావం సభలో అశేషజనవాహిని ఉద్దేశించి ప్రసంగిస్తూ… ‘ తొమ్మిదేళ్లుగా నాతో పాటుగా మీరు కూడా ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసు. కొంతమందిపై అక్రమ కేసులు పెట్టారు. మరికొందరిని పథకాలను దూరం చేశారు. 1280 మందిపై అక్రమ కేసులు పెట్టారు. మీకు తగిలిన ప్రతీ గాయం నా గుండెకు తగిలింది. అందుకే అధికారంలోకి రాగానే వాటన్నింటినీ ఎత్తివేస్తాం. కుల, మత, పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం. ఎన్నికల షెడ్యూలు రాబోతుంది. వైఎస్సార్‌ సీపీ విజయంలో కీలక పాత్ర పోషించాల్సిన బాధ్యత మీపై ఉంది’ అని వ్యాఖ్యానించారు.

SHARE

LEAVE A REPLY