ఆర్టీసీ ఎండీతో నేడు జేఏసీ నేతల చర్చలు

0
185

Times of Nellore (Amarvati)#కోట సునీల్ కుమార్ # – ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. నేడు మరోసారి ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుతో జేఏసీ నేతలు సమావేశంకానున్నారు. ఆర్టీసీ హౌస్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు జేఏసీ నాయకులు ఎండీని కలుస్తారు. నిన్న అర్థరాత్రి వరకూ ఎండీ సురేంద్రబాబుతో జరిగిన చర్చలు సమస్యల పరిష్కార దిశగా సాగాయి. 90శాతం వరకూ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం సానుకూలంగా ఉందని జేఏసీ నాయకులు తెలిపారు.

హామీల అమలుకోసం ఎంవోయూ ఇచ్చేందుకు ఎండీ అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ఎండీని జేఏసీ నేతలు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. చర్చల అనంతరం ఆర్టీసీ ఎండీ, జేఏసీ నేతలు కలిసి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దగ్గరకు వెళ్తారు. సమ్మెపై నిర్ణయాన్ని సీఎం సమక్షంలో జేఏసీ నేతలు ప్రకటించే అవకాశం ఉంది.

SHARE

LEAVE A REPLY