RRR నుండి మరొక కీలక సీన్ లీక్ : సోషల్ మీడియాలో వైరల్…..!!

0
42

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఇటీవల తాను తెరకెక్కించిన బహుబలి రెండు భాగాల విజయాలతో అద్భుతమైన సక్సెస్ ని అందుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని దేశవిదేశాల్లో కూడా మారు మ్రోగేలా చేసాడు. ఇక ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో కలిసి ఆయన తీస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ పై టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సహా పలు ఇతర భాషల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

టాలీవుడ్ సహా పలువురు కోలీవుడ్ , బాలీవుడ్ , హాలీవుడ్ నటులు నటిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల ఎన్టీఆర్ కు సంబందించిన ఒక వీడియో లీక్ అయి పెద్ద సంచలనం సృష్టించింది. దానితో అలర్ట్ అయిన రాజమౌళి, ఇకపై సెట్స్ లోకి సెల్ ఫోన్ వంటి వాటిని తీసుకురావడం నిషేదించడంతో పాటు, సెట్ కి వచ్చే విజిటర్స్ పై కూడా కొన్ని గట్టిగా నిఘా పెట్టారట. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవల బల్గెరియాలో తీసిన ఎపిసోడ్ లో భాగంగా ఎన్టీఆర్ కు సంబందించిన ఒక వీడియో నేడు కాసేపటి క్రితం లీక్ అయి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.

కాగా విషయం తెలుసుకున్న ఆర్ఆర్ఆర్ యూనిట్, ఒక్కసారిగా షాక్ లో ఉన్నట్లు సమాచారం. అయితే వీడియో మరింతగా స్ప్రెడ్ కాకుండా వీలైనంతవరకు దానిని పలు మీడియా మాధ్యమాల నుండి డిలీట్ చేయించారట. అయినప్పటికీ కూడా దానిని కొందరు వాట్సాప్ వంటి వాటిల్లో షేర్ చేస్తున్నారని సమాచారం. కాగా ఈ విధమైన లీకేజీ ల వల్ల మంచి సినిమాలు తీయలనే భావన నిర్మాత, దర్శకుల్లో కొరవడుతుందని, దయచేసి ఇటువంటివి ఎంకరేజ్ చేయొద్దని మా హెరాల్డ్ సంస్థ తరపున మనవి చేస్తున్నాము…..!!

SHARE

LEAVE A REPLY