చంద్రబాబును ఏకేసిన రోజా….

0
538

Times Of Nellore ( Nandyal ) -నంద్యాల ఉప ఎన్నికలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తటస్థంగా ఉండడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటిలాగే ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై దుమ్మెత్తిపోశారు. రేప‌టి నుంచి చంద్ర‌బాబు కుట్ర‌లు, హ‌త్యా రాజ‌కీయాలు మొద‌ల‌వుతాయని ఆమె అన్నారు. ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచిన ఘ‌నుడు చంద్ర‌బాబు అని ఆమె వ్యాఖ్యానించారు.ఎన్టీఆర్ అర చేతిల్లోంచి పార్టీనీ లాక్కున్న ఘ‌నుడు చంద్ర‌బాబు అని అన్నారు.చీక‌ట్లో చిదంబ‌రం కాళ్లు ప‌ట్టుకున్న‌ది చంద్ర‌బాబు అని రోజా అన్నారు. నంద్యాల‌లో టీడీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు తెలిసిందని ఆమె వ్యాఖ్యానించారు. రాయ‌ల‌సీమ ద్రోహి చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ‌కు రావ‌ల్సిన ఎయిమ్స్ ను త‌ర‌లించారని విమర్శించారు.

మ‌న్న‌వ‌రం ప్రాజెక్టును అడ్డుకున్న‌ది చంద్ర‌బాబే అని రోజా అన్నారు. వైయ‌స్ఆర్ కు పేరు వ‌స్తుంద‌ని మ‌న్న‌వ‌రం ప్రాజెక్టును అడ్డుకున్నారని ఆమె అన్నారు. రాయ‌ల‌సీమ‌కు రావాల్సిన సెంట్ర‌ల్ వ‌ర్సిటీని కూడా తీసుకురాలేదని అన్నారు. మైనార్టీల‌ను మోసం చేసే య‌త్నంలో చంద్ర‌బాబు ఉన్నారని విమర్శించారు. చంద్ర‌బాబు గ‌జినీ.. ఆయ‌న‌కు ఇచ్చిన హామీలు గుర్తుండ‌వని రోజా అన్నారు. ఓర్వ‌క‌ల్లు ప్రాజెక్టు ప‌నులు ఇప్ప‌టికీ ప్రారంభం కాలేదని చెప్పారు. క‌ర్నూలును విత్త‌న‌ రాజ‌ధానిని చేస్తాన‌న్నారు.. ఏమైంది బాబు? అని అడిగారు. టెక్స్ టైల్ పార్క్ లు ఏమ‌య్యాయని ప్రశ్నించారు. చంద్ర‌బాబు 300 ఎలుక‌లు ప‌ట్ట‌డానికి 60 ల‌క్ష‌లు విడుద‌ల చేశారని, అంటే ఒక్కొక్క ఎలుక‌కు 20వేలు ఖర్చు చేశారని ఆమె చెప్పారు.

చంద్ర‌బాబు పాల‌నా తీరును ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారని రోజా అన్నారు. కుట్ర‌ల‌కు 100శాతం పేటెంట్ రైట్ చంద్ర‌బాబుదేనని, ఎన్నిక‌ల‌ను ఆప‌డానికే చంద్ర‌బాబు వ‌స్తున్నారని అన్నారు. నంద్యాల‌లో తెగించ‌డానికి టీడీపీ సిద్ద‌మైందని, నంద్యాల ఓట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాలని రోజా అన్నారు. టీడీపీ నేత‌లు ఎంత డ‌బ్బు ఇచ్చినా వైయ‌స్ఆర్ సీపీ వెంటే ఉండాలని అన్నారు. నంద్యాల ప్ర‌జ‌లు వైయ‌స్ఆర్ కుటుంబం వెంటే ఉంటారని, నంద్యాల ఓట‌ర్లు డ‌బ్బుకు అమ్ముడుపోయేవారు కాదని అన్నారు. నంద్యాల ప్ర‌జ‌లు పౌరుషం ఉన్న‌వారని రోజా అన్నారు. టీడీపీ ఓడిపోవడం ఖాయమని ఆమె అన్నారు. ఆ రకంగా కేంద్ర నిఘా సంస్థ‌లు నివేదిక ఇచ్చాయని ఆమె అన్నారు. నిఘా నివేదిక‌ల‌ను మీడియాకు విడుద‌ల చేయాలని అడగాల్సిందిగా ఆమె సూచించారు.

SHARE

LEAVE A REPLY