రోడ్డుపై దొర్లుతూ… టిక్ టాక్ వీడియో చివరకు…!!

0
62

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒–టిక్‌టాక్ బ్యాన్ చేయాలనే డిమాండ్ మరోసారి గట్టిగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డిమాండ్‌పై ఇప్పుడు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. టిక్‌టాక్‌ను ఇష్టపడే వ్యక్తులు బ్యాన్ ను వ్యతిరేకిస్తున్నారు. టిక్‌టాక్ వల్ల ఎంతో మందికి తమ ప్రతిభను ప్రదర్శించుకోడానికి అవకాశం లభించిందని అంటున్నారు. మరికొందరు మాత్రం.. టిక్‌టాక్ తప్పకుండా బ్యాన్ చేయాలని, దాన్ని కొనసాగిస్తే అబ్బాయిలంతా భవిష్యత్తులో అమ్మాయిలుగా మారిపోయే ప్రమాదం ఉందని సెటైర్లు పేలుస్తున్నారు. అయితే టిక్‌టాక్ స్టార్ అని చెప్పుకొనే ఈ యువతి చేసిన వీడియో చూస్తే.. మీరు కూడా టిక్‌టాక్ బ్యాన్ చేయడమే ఉత్తమం అని అంటారు. అహ్మదాబాద్‌లో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్న 21 ఏళ్ల సోను నాయక్‌కు టిక్‌టాక్‌లో ఓ మిలియన్ అభిమానులు ఉన్నారు. టిక్ టాక్ లో తన వీడియోలు మరింత వెరైటీగా ఉండాలనే ఉద్దేశంతో రాత్రి 9 గంటలకు ఆమె లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఇసాన్‌పూర్ వంతెన వద్దకు వెళ్లింది. అక్కడ రోడ్డుపై దొర్లుతూ కాసేపు వీడియోలు తీసుకుంది. మోడీగారు ఇది మా ఇసాన్‌పూర్ వంతెన. లాక్‌డౌన్ ఎత్తేయండి అని నవ్వుతూ వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్టు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పోలీసులకు చిక్కాయి. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

SHARE

LEAVE A REPLY