ఆహార పదార్దాల ప్రకటనలపై ఆంక్షలు

0
90

Times of Nellore (Hyd) #కోట సునీల్ కుమార్# – ఆహార భద్రతా ప్రమాణాల మండలి (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) స్పష్టం చేసింది. అసత్య ప్రకటనలతో నాణ్యత లేని, కల్తీ ఆహార పదార్థాలను ప్రజలకు అమ్మకుండా అడ్డుకునేందుకు ఆహార భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేసింది. ‘సహజ, తాజా, ఫైనెస్ట్‌, బెస్ట్‌, జెన్యూన్‌, ప్రీమియం..’ తదితర పదాలను వాణిజ్య ప్రకటనల్లో వాడకూడదు. ఆహార పదార్థాల సహజ గుణం పాడవకుండా కేవలం శుద్ధి చేసి అమ్మితేనే ఈ పదాలు వాడాలి. దాన్ని గుణం మార్చి విక్రయించేవారు ఇలాంటి పదాలతో ప్రచారం చేయకూడదు. ‘శక్తినిస్తాయి’ అని ప్రచారం చేసే పదార్థాలపై వాటిలో శక్తికి కారణమైన పోషక విలువలేమిటో.. కొవ్వు, ఉప్పు, చక్కెర, కొలెస్ట్రాల్‌, విటమిన్లు, ప్రొటీన్లు ఏ దామాషాలో ఉంటాయో ముద్రించాలి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆహార భద్రతా చట్టం కింద రూ.10 లక్షల వరకు జరిమానా వేస్తారు. పలు ఆహారోత్పత్తుల నాణ్యతా ప్రమాణాలను సవరిస్తూ ఇటీవల మండలి వేర్వేరుగా ముసాయిదాలను విడుదల చేసింది. వీటిపై రాష్ట్రాల్లోని పలు వర్గాల అభిప్రాయాలు, సలహాలు, సూచనలను ఆహ్వానించింది. వచ్చిన అభిప్రాయాలన్నిటినీ క్రోడీకరించి, నిబంధనలను చట్టంలో పొందుపరచనుంది.

SHARE

LEAVE A REPLY