లాంచీని ఒడ్డుకు తెచ్చిన ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలు

0
458

Times of Nellore (Amaravati) – గోదావరిలో మునిగిన లాంచీని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఒడ్డుకు తీసుకువచ్చాయి. లాంచీ అద్దాలు పగులగొట్టి మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నలుగురి మృతదేహాలను వెలికి తీయగా, అందులో కవల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను ఒడ్డుకు చేర్చి, అక్కడే పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న బాధితుల కుటుంబసభ్యులు తమ వారిని గుర్తించేందుకు వేచి చూస్తున్నారు. కాగా ప్రమాదంలో ఎంత మంది చనిపోయారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

SHARE

LEAVE A REPLY