ఏపీలో మరోసారి రీపోలింగ్

0
234

Times of Nellore (Amaravati) #కోట సునీల్ కుమార్ # – ఏపీలో మరోసారి రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈనెల 19న సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ రోజున 5 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌.ఆర్ కమ్మపల్లి-321, పులిహోర్తిపల్లి-104, కొత్తకండ్రిగ-316, కమ్మపల్లి-318, వెంకట్రామపురం-313 పోలింగ్ బూత్‌ల్లో రీపోలింగ్‌కు ఆదేశించింది. ఇప్పటికే ఈనెల 6న రాష్ట్రంలో ఐదు స్థానాల్లో రీపోలింగ్ నిర్వహించారు. అయితే చంద్రగిరి స్థానంలో రీపోలింగ్ నిర్వహించాలంటూ ఈసీకి టీడీపీ, వైసీపీ పరస్పర ఫిర్యాదులు చేశారు. ఇవాళ కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు.. అడిషనల్ సీఈవోను కలిసి రీపోలింగ్ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి రాష్ట్రంలో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19న ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.

SHARE

LEAVE A REPLY