రవిప్రకాశ్‌ను కస్టడీకి ఇవ్వండి!

0
52

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను కస్టడీకి ఇవ్వాలని బంజారాహిల్స్‌ పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఆయన్ను 10 రోజుల కస్టడీకి అప్పగించాలంటూ నాంపల్లి కోర్టుకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. రవిప్రకాశ్‌ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు.

రవిప్రకాశ్‌ తన స్వప్రయోజనాల కోసం నిధులు మళ్లించుకున్నారంటూ వచ్చిన అభియోగాలపై ఆయన్ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అసోసియేట్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంచాలకుడు జి.సింగారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

SHARE

LEAVE A REPLY