రాష్ట్ర భవిష్యత్ ను, ప్రతిష్టను మంట గలిపే పరిస్థితిని వైసిపి తీసొకొవచ్చింది..!

0
130

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – ఎపి రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వమని ప్రపంచ బ్యాంకు చేసిన ప్రకటనలో ఎక్కడా అవినీతి గురించి ప్రస్తావించలేదని మాజీ సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. మంగళగిరిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, వైసిపి నేతలు కావాలనే గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, వాస్తవాలను వక్రీకరించి వైసిపి నేతలు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ బ్యాంకు వెనక్కి వెళ్లిపోవడమనేది చాలా దురదృష్టకరమని, అశుభమని అన్నారు. రాష్ట్ర భవిష్యత్ ను, ప్రతిష్టను మంట గలిపే పరిస్థితిని వైసిపి తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూర్ఖత్వంగా ప్రవర్తించినా కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా బ్యాలెన్స్ డ్ గా ఉండాలని ప్రభుత్వానికి సూచించారు.

SHARE

LEAVE A REPLY