విషాదం..రేడియో రాంబాబు ఇకలేరు..!!

0
141

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-రేడియో రాంబాబు..ఈ పేరు ఇప్పటి హైటెక్ జనరేషన్‌ను పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. కాని రెండు, మూడు దశాబ్దాలకు ముందు ఆయనో స్టార్. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది..డి. వెంకట్రామయ్య అనే స్వరం అప్పట్లో ప్రతి ఇంటి రేడియోలో రోజు వినిపించేది. ఆ వాయిస్‌ రోజూ ఎన్నో తెలుగు గడపలను తాకేది. అటువంటి వ్యక్తి ఇకలేరు. సోమవారం(జనవరి13) ఆయన హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులతో పండగపూట సినిమా చూడటానకి వెళ్లి థియేటర్‌లోనే కుప్పకూలిపోయారు. దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా వెంకట్రామయ్య మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం ప్రకటించారు.

కృష్ణాజిల్లా దొండపాడు గ్రామంలో జన్మించిన వెంకట్రామయ్య కేవలం రేడియో వ్యాఖ్యతగానే కాదు.. నాటక రచయితగా, అనువాదకుడిగా, న్యూస్ రీడర్‌గానూ సత్తా చాటారు. 1963లో ఆకాశవాణిలో చేరిన ఆయన.. దాదాపు 30 ఏళ్ల అక్కడే సేవలందించారు. ఫేమస్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తీసిన ‘పంతులమ్మ’ సినిమాకు రచయితగానూ పనిచేశారు. ఆయన మృతి పట్ల పలు పేపర్, టీవీ జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం వెంకట్రామయ్య అంత్యక్రియలు ఈఎస్ఐ శ్మశాన వాటికలో జరిగాయి.

SHARE

LEAVE A REPLY