విజయవాడలో ప్రత్యక్షమైన పీవీపీ

0
63

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. బెంజ్‌సర్కిల్ దగ్గర 108, 104 వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పీవీపీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొద్దిసేపు సీఎం జగన్‌తో ముచ్చటించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే పీవీపీపై రెండు కేసులు నమోదయ్యాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14లోని విల్లా గొడవలో ఒక కేసు నమోదు కాగా.. విచారణ కోసం ఇంటికి వెళ్లిన పోలీసులపై కుక్కలను వదిలినందుకు మరో కేసును పోలీసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయనకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

SHARE

LEAVE A REPLY