పబ్‌బీ గేమ్ ఆడొద్దన్నందుకు బాలుడు ఆత్మహత్య

0
55

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- చిత్తూరు జిల్లాలోని పలమనేరు శ్రీనగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. పబ్‌జీ గేమ్ ఆడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో శ్యామ్ ప్రసాద్ (14) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పబ్‌బీ గేమ్ ఆడటానికి అలవాటుపడ్డ కుమారుడ్ని తల్లిదండ్రులు మందలించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైన బాలుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన స్థానికంగా ఉన్న పలమనేరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. శ్యామ్ మృతితో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా ఈ మధ్య పబ్‌బీ గేమ్ ఆడొద్దన్నందుకు పలువురు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే.

SHARE

LEAVE A REPLY