పృధ్వీ నోట బూతు పురాణం.. జగన్ కు కొత్త తలనొప్పి..?

0
159

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృథ్వీకు జగన్ ఇటీవల ఎస్వీబీసీ ఛైర్మన్ గా పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పదవిని టీడీపీ హయాంలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు నిర్వహించారు. శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ ఛైర్మన్ అంటే చాలా బాధ్యతతో కూడిన పదవి.

కానీ ఈ పదవి పృధ్వీ ఇలా చేపట్టాడో లేదో.. అప్పడే టీడీపీ సోషల్ మీడియా గ్రూపులు ట్రోలింగ్ ప్రారంభించాయి. పృథ్వీ బూతులు మాట్లాడుతున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియో వైసీపీకి తలనొప్పిగా మారింది.

ఆ వీడియోలో పృథ్వీ..” మా అమ్మ.. లం.. రికం చేసిందో.. వాళ్లమ్మ లం..రికం చేసిందో తెలియాలి.. అంటూ బూతులు మాట్లాడారు. అయితే ఈ వీడియో ఎప్పటిది అన్న విషయంపై క్లారిటీ లేదు. ఇది ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి వచ్చాక మాట్లాడిందా.. లేక.. అంతకు ముందుగా అన్న విషయం తెలియాల్సి వుంది.

వీడియో ఎప్పటిదైనా ఆ మాటలు మాత్రం పృధ్వీవే. ఇలాంటి వ్యక్తికి అంతటి కీలకపదవి ఇచ్చారా అన్న అనుమానం సామాన్యుడికి సైతం వచ్చేలా ఈ వీడియో ఉంది. అందుకే.. ప్రజాజీవనంలో ఉండే వారు నోరు అదుపులో పెట్టుకోవాల్సిందే.. లేకపోతే.. ఇలా ట్రోల్ అవుతూ ఉంటారు మరి.

SHARE

LEAVE A REPLY