గర్జించిన మహిళాలోకం..

0
77

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – రాజధాని నడిబొడ్డున మహిళాలోకం గర్జించింది. ఆడబిడ్డ కంట కన్నీరు చూడనన్న రాజ్యంలో మానవ మృగాల వేటకు మహిళలు బలవుతున్నా పాలకులు పట్టించుకోకపోవటంపై ఎలుగెత్తి ప్రశ్నించింది. దేశవ్యాప్త ఉద్యమంగా, మరో నిర్భయ పోరాటంగా మలిచేందుకు సమరశంఖం పూరించింది. ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థలో తమకు భద్రతెక్కడంటూ నిలదీసింది. ‘మహిళలకు భద్రత కల్పించాలి.. అఘాయిత్యాలను నిరోధించాలి.. బంగారు తెలంగాణలో మహిళలకు భద్రతేది..?’ అంటూ పలు మహిళా సంఘాలకు చెందిన నేతలు, కార్యకర్తలు దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. ప్రియాంకారెడ్డి హత్యోదంతాన్ని నిరసిస్తూ ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు వద్ద సీపీఐ (ఎం) ఆధ్వర్యాన మానవహారం చేపట్టగా..మహిళా సంఘాలన్నీ కలిసి భారీ ప్రదర్శన నిర్వహించాయి. ఏఐఎఫ్‌డీడబ్ల్యూ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ర్యాలీలో కె.ఎన్‌ ఆశాలత (ఐద్వా), సత్యవతి (భూమిక), సంధ్య (పీవోడబ్ల్యూ), దేవి, విమల (సామాజికవేత్తలు), సుమిత్ర (అంకురం), సృజన (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY