ప్రజల సహకారంతోనే డెంగ్యూ నివారణ

0
139

Times of Nellore (Vijayanagaram) #కోట సునీల్ కుమార్ # – డెంగ్యూ నియంత్రణ ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి కె.విజయలక్ష్మి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో డెంగ్యూ నివారణకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2018లో జిల్లాలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని, ఈ ఏడాది అటువంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం ముందస్తుగా 3.40లక్షల దోమతెరలను గిరిజన ప్రాంతాల్లో పంపిణీ చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ ప్రభావిత ప్రాంతాలుగా 90 గ్రామాలను గుర్తించామని, ఈ ప్రాంతాల్లో డెంగ్యూ నివారణకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు శుక్రవారం డ్రై డేను పాటించాలని, దోమతెరలు వినియోగించాలని కోరారు. సమావేశంలో అదనపు డీఎంహెచ్‌వో రవికుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY