గర్భిణీ ని కత్తితో పొడిచి..మూడేళ్ళకూతురును పొడిచి..చివరికిలా…

0
948

Times Of Nellore ( Tirupati ) – పుట్టినరోజునే ఓ భర్త తన భార్యను,మూడేళ్ళ కూతురుపై కత్తితో దాడి చేశాడు. వారు చనిపోయారని భావించి తాను ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకొంది. తిరుపతి పట్టణంలోని అబ్బన్న కాలనీలో కె.స్వాతి కుమార్ నివాసం ఉంటున్నాడు. ఆయన ఓ ప్రైవేట్ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు తమిళనాడులోని పోలూరుకు చెందిన మహలక్ష్మితో 2011 లో వివాహమైంది.ఈ దంపతులకు సాహితి అనే మూడేళ్ళ కూతురు కూడ ఉంది. మహలక్ష్మి ప్రస్తుతం ఎనిమిది మాసాల గర్భవతి.బుదవారం నాడు మహలక్ష్మి పుట్టినరోజు.అయితే పుట్టిన రోజు కావడంతో ఆమె పుట్టింటివారు ఉదయాన్నే ఫోన్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

స్వాతి కుమార్ ఉదయం పూట తన కూతురును ప్లే స్కూల్ లో వదిలేసి ఆఫీసుకు వెళ్ళాడు.మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు స్వాతికుమార్ భోజనానికి వచ్చాడు. అయితే తాను ఇంటికి వచ్చే సమయంలో కూతురును కూడ ఇంటికి తీసుకువచ్చాడు.అయితే ఆ సమయంలో ఏమైందో ఏమో తెలియదు వంటగదిలో ఉన్న కత్తితీసుకొని భార్య కడుపు, గొంతుపై పొడిచాడు స్వాతికుమార్.అంతేకాదు కూతురును కూడ పొడవడంతో పేగులు బయటికివచ్చాయి. అయితే వీరిద్దరూ చనిపోయారని భావించిన స్వాతికుమార్ తాను కూడ గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే మహలక్ష్మి సమీపంలోని డాక్టర్ రామకృష్ణను తమ ప్రాణాలు కాపాడాలని ఆర్థించింది.దీంతో ఆయన హుటాహుటిన అక్కడికి చేరుకొని వారికి చికిత్స అందించాడు. తల్లి, కూతురు ప్రాణాపాయం నుండి బతికి బయటపడ్డారు.అయితే మహలక్ష్మి గర్భంలోశిశువు కత్తిపోట్లకు గురై చనిపోయింది. అయితే స్వాతికుమార్ ఎందుకు ఈ ఘటనకు పాల్పడ్డారో అర్థం కావడం లేదని స్థానికులు చెబుతున్నారు.

SHARE

LEAVE A REPLY