డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా – మంత్రి గంటా

0
354

Times of Nellore ( vijayawada ) – డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేస్తున్నామని మంత్రి గంటా శ్రీనివాస్ రావు తెలిపారు. శుక్రవారం టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీపై ఆయన మాట్లాడుతూ ఆర్థిక శాఖ కొన్ని కొర్రీలు పెట్టిందని… వాటికి సంబంధించిన వివరాలు పంపామని చెప్పారు. త్వరలోనే డీఎస్సీకి ఆర్థికశాఖ అనుమతి ఇస్తుందని, వారం రోజుల్లోగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్‌సీటీఈ ఆదేశాలపై స్పష్టత తీసుకోవాల్సి ఉందని అన్నారు. టెట్ కం టీఆర్టీ నిర్వహించే అవకాశం ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మరోవైపు ఈరోజు జరిగే కేబినెట్ సమావేశానికి హాజరవుతున్నట్లు తెలిపారు. సీఎంతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. భీమిలి సీటుపై ఏ గొడవ లేదని.. అంతా మీడియా సృష్టే అని మంత్రి గంటా వెల్లడించారు.

SHARE

LEAVE A REPLY